Home తాజా వార్తలు ఇన్‌స్పైర్ ప్రదర్శనలో నాగర్‌కర్నూల్ విద్యార్థుల ఉత్తమ ప్రదర్శన

ఇన్‌స్పైర్ ప్రదర్శనలో నాగర్‌కర్నూల్ విద్యార్థుల ఉత్తమ ప్రదర్శన

Nagarkurnool students Best Performance

 

నాగర్‌కర్నూల్: వరంగల్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శనలో నాగర్‌కర్నూల్ విద్యార్థుల ఉత్తమ ప్రదర్శనలు కనపరిచారు. ఈ ప్రదర్శనలో మంగనూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి భూగర్భజల నీటి మట్టం నింపుడు గుంతల కన్నా ఆధునాతనమైన పద్ధతిలో మెరుగైన పని చేసే పరికరం ప్రదర్శించారు. పెద్దకొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రమాదాలను నివారించుట, రాత్రి పూట ప్రయాణాల్లో డ్రైవర్లకు నిద్ర వస్తుంటే వారిని అప్రమత్తం చేసే పరికరం. అంబటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి వ్యవసాయంలో కలుపు నివారణకై అతి తక్కువ ఖర్చుతో ఉపయోగించే యంత్రంను ప్రదర్శించారు. చందుబట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అతి తక్కువ ఖర్చుతో ఇంటి అవసరాలకు ఉపయోగించే విద్యుత్ సౌరశక్తి ఉత్పత్తి పరికరం ప్రదర్శించారు. వెల్దండ కెజిబివి విద్యార్థిని శుద్ధినీటి వినియోగం, నీటిని వృదా చేయకుండా పయోగించే పరికరాలను ప్రదర్శించి నాగర్‌కర్నూల్ జిల్లా నుండి విద్యార్థులు ఉత్తప ప్రదర్శనలు ప్రదర్శించారు.

Nagarkurnool students Best Performance in Inspire Show