Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జాతరకు ‘నాగులమ్మ’ ముస్తాబు

రేపటి నుంచే నాగులపేట జాతర… హాజరు కానున్న లక్షకు పైగా భక్తులు..
నాగులమ్మకు భారీగా కట్న కానుకలు జాతరకు అధికంగా వచ్చేది మహిళ భక్తులే…

Nagulamma-Jatara

కోరుట్ల రూరల్: కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలోని నాగులమ్మ భక్తుల కొంగుబంగారంగా నిలుస్తుంది. గ్రామ ఆలయ కమిటి వారు జాతర ఉత్సవాల కోసం ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తుల కోసం తాగునీరు చలువ పందిల్లతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చేర్మేన్ సింగిరెడ్డి నవీన్‌రెడ్డి,గౌరవ అధ్యక్షులు సింగిరెడ్డి రారాయణరెడ్డి,కోశాధికారి బండ నరేష్,ఆలయ కమిటి డైరెక్టర్లు,సర్పంచ్,వార్డు మెంబర్లు వెల్లడించారు. రేపు నవనాగుల సహిత శివ పంచాయతన నాగులమ్మ జాతర జరగనుంది.

సాయంత్రం వెంకటేశ్వర కళాబృం దం హైదరాబాద్ వారిచే సంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. మండలం లోనే అత్యంత వైభవంగా జరిగే నాగమ్మ జాతర కోసం నెల రోజుల ముందు నుండే ఆలయ ప్రాంతంలో వసతుల ఏర్పాట్ల కోసం గ్రామస్థులు ఐక్యంతో ముందుకు రావడం విశేషం. జాతర రోజున నిర్వహించే అన్నదాన కార్య క్రమానికి యువకులు ఎంతో ఉత్సహాంగా అన్నదాన దాతల సహయంతో వివిధ గ్రామాల నుండి వచ్చే నాగమ్మ భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడడం తమ భాధ్యత అని తెలుపుతున్నారు.

జాతరకు అధికంగా వచ్చేది మహిళ భక్తులే…

తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక నాగులమ్మ ఆలయం గల నాగులపేట నాగులమ్మ ఎంతో చరిత్ర ఉంది జాతరకు వచ్చే భక్తులు కుటుంబసమేతంగా ఉదయమే నాగులమ్మ ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి చల్లంగా చూడలాని నాగమ్మను కోరుతారు. ముక్యంగా ఈ జాతరకు మహిళ భక్తులే అధికంగా వస్తారని పుట్టలో పాలు పోసేవరకు కనీ సం మంచినీల్లు కూడా తాగక ఎంతో నిష్టాలతో ఉండి మహిళలు మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలో అందరు నాగమ్మ భోజనం లభించడం మహా ప్రసాధమి వెల్లడిస్తారు.పాలు,కోడి గుడ్లతో పాటు ప్రత్యేక నైవేద్యాన్ని నాగమ్మకుస మర్పించిపూజలు, అర్చనలు,అభిషేకాలు, ప్రధక్షణలు నిర్వహిస్తారు..

నవనాగులు,ముఖద్వారం నిర్మాణాలు…

అత్యాంత విశిష్టత కలిగిన నాగమ్మ ఆలయం ప్రతి యోట అభివృద్ది చెందుతుంది. మొదలు ఓ వృక్షం వద్ద పురాతన శిల్పాలకు పూజులు చేసేవారు. గ్రామస్థుల ఐక్యంతో ఉండి దాతల ద్వారా విరాళాలు సేకరించి నాగమ్మపై ఉన్న నమ్మకంతో ఆ ఆలయా అభివీద్దికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు.15 లక్షలతో నూతనంగా నవనాగుల ఆలయం,10 లక్షలతో వ్యయంతో ముఖద్వారం నిర్మాణాలు పూర్తిచేసి నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ముఖద్వారాన్ని ప్రారంభింప చేశారు.

Comments

comments