Home తాజా వార్తలు రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి గర్వించదగ్గ వ్యక్తి: నాయిని

రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి గర్వించదగ్గ వ్యక్తి: నాయిని

Naini

హైదరాబాద్: రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అబిడ్స్ లో పైలాన్ ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. మనమందరం గర్వించదగ్గ వ్యక్తి, విద్య వికాసం కోసం తపించిన వ్యక్తి రాజా బహదూర్ అని పేర్కొన్నారు.  వెంకటరామిరెడ్డి  మహిళలకు ఉచితంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు.సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించమని ఈ సందర్భంగా నాయిని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ బుద్వేలులో 15 ఎకరాల స్థలం, రూ. 10కోట్లు మంజూరు చేశారు.తాబ్ధి ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రెడ్డి హాస్టల్‌తో మాకు ఎంతో అనుబంధం ఉందని ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. 80శాతం మంది రెడ్డిలు వ్యవసాయరంగంపై ఆధారపడి బతుకుతున్నారని ఎంపి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,  ఎంఎల్ సి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.