Home తాజా వార్తలు మరో పదేళ్లు అధికారం మాదే : నాయిని

మరో పదేళ్లు అధికారం మాదే : నాయిని

NAINI

సంగారెడ్డి : మరో పదేళ్లు టిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని హెరిటేజ్ జైలు మ్యూజియం వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన టిఆర్‌ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. గడ్డాలు పెంచి ప్రగల్భాలు పలికినంత మాత్రాన కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని గత పాలకులు బెదిరించారని, ఇప్పుడు తెలంగాణలో కరెంట్ సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.

Naini Comments on Congress