Search
Friday 21 September 2018
  • :
  • :

కేరళ సిఎంకు చెక్కు అందజేసిన నాయిని

Naini Gave 25 Crore Rupees cheque to Kerala CM Vijayan

తిరువనంతపురం : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. కేరళకు దేశ వ్యాప్తంగా ఆర్థిక సాయం అందుతోంది. ఈ క్రమంలోనే కేరళ వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేరళ సిఎం పినరయి విజయన్‌కు ఆదివారం అందించారు. అంతేకాకుండా విజయ డైరీ ఆధ్వర్యంలో రూ.2.5 కోట్ల విలువ చేసే ఆర్వో ప్లాంట్లు, రూ.40 లక్షల విలువ చేసే 20 టన్నుల పాలపొడిని ఆదివారం ఆర్మీ విమానంలో కేరళకు తరలించారు. కేరళ వరద బాధితుల కోసం మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ తమ నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. టిఆర్‌ఎస్ ఎంపిలు సైతం తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.

Naini Gave 25 Crore Rupees cheque to Kerala CM Vijayan

Comments

comments