Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

శ్రీసీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నాయిని

NAINI

నాగర్ కర్నూలు : సిరసనగండ్ల గుట్టపై సోమవారం జరిగిన శ్రీసీతారాముల కల్యాణమహోత్సవంలో తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దంపతులు, ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు దంపతులు పాల్గొన్నారు. సిరసనగండ్ల ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సమైక్య పాలనలో తెలంగాణలోని ఆలయాలు సైతం వివక్షకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి , భద్రాద్రి దేవాలయాల తరహాలో సిరసనగండ్ల ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఆలయంలో జరిగిన శ్రీసీతారాముల కల్యాణమహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

Naini participant of the Seetharamula Kalyanam mahotsavam

Comments

comments