Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ పోలీసు … నెంబర్ వన్ : నాయిని

naini

హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నారని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కొత్తగా నిర్మించిన జవహర్‌నగర్ పోలీసు స్టేషన్ భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Naini’s Comments on Friendly Policing

Comments

comments