Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నకల్ రాకెట్

cartoon

*హద్దులు దాటుతున్న
ప్రైవేట్ విద్యాసంస్థలు
*కాపీయింగ్ కోసం అడ్డదారులు
*ఫలితాలే పరమావధిగా అనైతిక చర్యలు

పదో తరగతి ఫలితాలలో టాప్ ర్యాంకులు సాధించేందు కోసం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాప్రమాణాలు, నైతిక విలువలను పక్కన పెట్టి అడ్డదారులు తొక్కుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యుత్తమ గ్రేడింగ్ సాధించేందుకు ప్రైవేట్ పాఠశాలలు విలువలకు తిలోదకాలిస్తూ ఓ రాకెట్‌ను తలదన్నే విధంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రశ్నాపత్రాలను పరీక్షలకు ప్రారంభానికి ముందే లీక్ చేయడం అలాగే వాటికి జవాబులను రాయించి చీటీల రూపంలో తమ పిల్లలు పరీక్షలు రాసే సెంటర్లకు చేర్చడం లాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతూ ఈ ప్రైవేట్ పాఠశాలలు విద్యావ్యవస్థను అభాసుపాలు చేస్తున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నకల్ రాకెట్ కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు వేల రూపాయలను వ్యయం చేస్తూ అత్యుత్తమ ఫలితాలే లక్షంగా ప్రయత్నిస్తుండడం గమనార్హం. గత నాలుగైదు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు మాస్ కాపీయింగ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు దిగజారుతున్న నైతిక విలువలకు సాక్షంగా నిలుస్తున్నాయని అంటున్నారు.కొంత మంది ఉపాధ్యాయులను ప్రలోభపెట్టి ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యూహాత్మకంగా ప్రశ్నాపత్రాలను పథకం ప్రకారం లీక్ చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గత మూడు రోజుల క్రితం తాడిహత్నూర్ జడ్‌పిఎస్‌ఎస్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మరవక ముందే మరోసారి శుక్రవారం ఖానాపూర్‌లో ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతుందని అంటున్నారు. అయితే ఈ లీకేజీలకు ప్రధాన అస్త్రంగా సెల్‌ఫోన్లు వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. వాట్స్‌అప్ మెస్సేజ్‌ల ద్వారా లీకవుతున్న ప్రశ్నాపత్రాలు జిల్లావ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలా లీకైన ప్రశ్నాపత్రాలకు పలు ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బంది జవాబులను రాసి తమ విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాలకు చేరవేస్తుండడం చర్చకు తావిస్తుంది. ఖానాపూర్‌లో వెలుగు చూసిన మాస్ కాపీయింగ్ రాకెట్ వ్యవహారం పరీక్షలను నవ్వులపాలు చేస్తుందని అంటున్నారు. నిజాయితీగా చూచిరాతలకు తావు లేకుండా పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ వ్యవహారంతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఫలితాల కోసం ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు డబ్బులకు వెనుకాడడం లేదని అంటున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తమకు సహకరించే వారందరికీ విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తుండడమే కాకుండా నగదు పారితోషికాలు సైతం అందిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యూహాత్మకంగా ప్రశ్నాపత్రాలను పథకం ప్రకారం లీక్ చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గత మూడు రోజుల క్రితం తాడిహత్నూర్ జడ్‌పిఎస్‌ఎస్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మరవక ముందే మరోసారి శుక్రవారం ఖానాపూర్‌లో ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతుందని అంటున్నారు. అయితే ఈ లీకేజీలకు ప్రధాన అస్త్రంగా సెల్‌ఫోన్లు వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. వాట్స్‌అప్ మెస్సేజ్‌ల ద్వారా లీకవుతున్న ప్రశ్నాపత్రాలు జిల్లావ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలా లీకైన ప్రశ్నాపత్రాలకు పలు ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బంది జవాబులను రాసి తమ విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాలకు చేరవేస్తుండడం చర్చకు తావిస్తుంది. ఖానాపూర్‌లో వెలుగు చూసిన మాస్ కాపీయింగ్ రాకెట్ వ్యవహారం పరీక్షలను నవ్వులపాలు చేస్తుందని అంటున్నారు. నిజాయితీగా చూచిరాతలకు తావు లేకుండా పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ వ్యవహారంతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఫలితాల కోసం ఈ ప్రైవేట్ విద్యాసంస్థలు డబ్బులకు వెనుకాడడం లేదని అంటున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తమకు సహకరించే వారందరికీ విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తుండడమే కాకుండా నగదు పారితోషికాలు సైతం అందిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Comments

comments