Home సినిమా కృష్ణవంశీ ప్రేక్షకుల దర్శకుడు

కృష్ణవంశీ ప్రేక్షకుల దర్శకుడు

Nakshatramకృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కె.శ్రీనివాసులు, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఈ సినిమాలో సాయిధరమ్‌తేజ్, సందీప్‌కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. భీమ్స్, హరిగౌర, భరత్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆడియో సీడీలను సాయిధరమ్‌తేజ్, సందీప్ కిషన్ విడుదల చేసి తొలి సీడీని రెజీనా, ప్రగ్యాజైస్వాల్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, సందీప్ కిషన్, కృష్ణవంశీ, శ్రేయాశరణ్, ప్రగ్యాజైస్వాల్, రెజీనా, కె.వి.వి.సత్యనారాయణ, సుధీర్, విజయ్ కుమార్, సునీల్ నారంగ్, తనీష్, మానస్, రవి, మల్టీడైమన్షన్ వాసు తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ “గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ సమయంలో రామ్‌చరణ్‌ను కలవడానికి వెళ్లినప్పుడు కృష్ణవంశీని కలిసి మీరు ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉన్నా చెప్పండి సార్ చేస్తానని అన్నారు. అలా వచ్చిన అవకాశమే ఈ సినిమాలోని అలెగ్జాండర్ క్యారెక్టర్. ఈ సినిమాలో నటిస్తూ ఓ స్టూడెంట్ కాలేజీకి వెళ్లినట్లే పలు విషయాలు నేర్చుకున్నాను. ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌కు ఈ సంగతి చెప్పినప్పుడు వాళ్లు చాలా విషయాలు నేర్చుకుంటావురా అని అన్నారు. ఇక సినిమాకు భీమ్స్, హరిగౌర, భరత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నక్షత్రం వంటి సినిమా చేయడంతో నా కడుపు నిండిపోయింది”అని అన్నారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ “కృష్ణవంశీ ప్రేక్షకుల దర్శకుడు. ఆయన ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేస్తుంటారు. ముందు ఈ సినిమాలో సందీప్‌కిషన్, రెజీనా తప్ప పెద్ద స్టార్ కాస్ట్ లేరు. కానీ ఈరోజు ఇంత మంది స్టార్ కాస్ట్ ఉన్నందుకు కృష్ణవంశీనే కారణం. మహా భారతంతో అభిమన్యుడిలా ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత పెద్దదిగా మారడానికి కారణం కృష్ణవంశీ, సాయిధరమ్‌తేజ్‌లే కారణం”అని చెప్పారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ “నేను ఈ సినిమా ప్రయాణంలో మూడు రిలేషన్స్‌ను సంపాదించుకున్నాను. అందులో సాయిధరమ్‌తేజ్ ఒకరు. తను నా బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ రెజీనా. ఇప్పుడు కృష్ణవంశీ. ఆయన నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చారు. కృష్ణవంశీతో చేయాలన్న నా కల ఈ సినిమాతో తీరింది”అని తెలిపారు. శ్రియాశరణ్ మాట్లాడుతూ “కృష్ణవంశీతో పనిచేయాలని ప్రతి హీరోయిన్ కోరు కుంటుంది. నేను కూడా అలాగే కోరుకున్నా. ఈ సినిమాలో నేను చేసిన సాంగ్‌ను రాజు సుందరం ఎంతో బాగా కంపోజ్ చేశారు”అని అన్నారు.