Home నల్లగొండ నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అరుదైన గౌరవం

నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అరుదైన గౌరవం

 Nalgonda District Collector is a rare honor

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : తెలంగాణ ప్రభు త్వం విధి నిర్వాహణలో అంకితభావం, ప్రతిభ కనబరిచి ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసిన అధికారులకు 2018 ఎక్సలెన్స్ అవార్డులు సోమవారం హైదరాబాద్‌లోని ఎంసిహెచ్ ఆర్‌డి లో ప్రధానం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ రెండు అవార్డులకు ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకున్నారు. భూ రికార్డుల ప్రక్షా ళన లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో ని లి పినందుకు నిర్వహణ ఆర్గనైజింగ్ కెటగిరిలో అవా ర్డును హైదరా బాద్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర పురపాలక, ఐటిశాఖామంత్రి కె.తారక రామారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషీలు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు అందజేశారు. కిషోర బాలికల్లో నెలసరి సమస్యలతో ఆరోగ్య ఇబ్బందులు రాకుండా చేపట్టిన పరిశుభ్రతను ఉద్దేశించిన ‘మాసం’ ప్రాజెక్టుకు సా ధారణ విభాగంలో వ్యక్తిగత కేటగిరిలో కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకు న్నారు. అదేవిధంగా ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందజేయడంలో తీసుకు న్న ఉత్తమ చర్యలకు గాను 2017లో ప్రకటించిన ఎక్సలెన్స్ అవార్డును కూడా జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఆర్‌డిఒ వెంకటాచారి, స్త్రీ శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారిని పుష్పలత కూడా ఉన్నారు.