Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

Girl-friend-strick-on-boy-f

నల్లగొండ: ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నానిర్వహిస్తుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లెపల్లివారిగూడెం గ్రామంలో జరిగింది. యువతీ యువకులు ఇద్దరు ఒకే గ్రామస్తులు. అదే గ్రామానికి చెందిన గంజాల శ్రీనివాస్, యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వాళ్ల వివాహానికి శ్రీనివాస్ తల్లిదండ్రులు ఒప్పుకొలేదు దీంతో ఆ యువకుడు మొఖం చాటేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు రెండో రోజు ధర్నాకు నిర్వహిస్తుంది. దీంతో తల్లిదండ్రులతో కలిసి గ్రామం నుంచి శ్రీనివాస్ పరారైయ్యాడు. ప్రియుడు వచ్చి తనను వివాహం చేసుకునేంత వరకు ధర్నా విరమించేది లేదని బాధిత యువతి తేల్చి చెప్పింది.  బాధితురాలికి ఆ గ్రామస్తులంతా అండగా నిలిచారు.

Comments

comments