Home తాజా వార్తలు వైభవంగా కాళికా మాత బోనాలు

వైభవంగా కాళికా మాత బోనాలు

2NKL05నల్లగొండ ః పట్టణంలోని సంతోష్ నగర్‌లోని కాళికా మాత ఆలయంలో ఆదివారం బోనాల పండుగ కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అమ్మవారికి నిత్యాభిషేకం, అలంకరణ, ఉదయం 8 గంటలకు భక్తులచే ఉత్సవ విగ్రహమూర్తికి అభిషేకం, సర్వదర్శనం, ఉదయం 10.30 గంటలకు సర్వదర్శనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక శివాలయం నుంచి మహంకాళి బోనంను మహిళా కోలాట బృందాలు,డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు, వైస్ ఎంపీపీ సామ బాలమ్మలు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బ్రహ్మదేవర రవిశంకర్, యల్లపురెడ్డి యాదగిరిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

2NKL06 2NKL04