Home మహబూబ్‌నగర్ కనుమరుగు కానున్న… నల్లమల అందాలు

కనుమరుగు కానున్న… నల్లమల అందాలు

Rice1

యురేనియం తవ్వకాలకు నల్లమల ప్రాంతం కనుమరుగౌతుందా?  .. భారత దేశ విస్తీర్ణంలో 2464  చ.కీ. మీ విస్తరించి దేశంలోనే అతిపెద్ద నల్లమల టైగర్  రిజర్వు ఇప్పుడు మాయమైపోనుందా? పచ్చనిచెట్లు పక్షుల కిలకిల రావాలు మూగబోయి కృష్ణమ్మ పరవళ్లు కళుషితమై పోతాయా? అసలు ఈ ప్రాంతంలోనిప్రజలు ఏమవ్వాలి. చెట్లను గుట్టలను నమ్ముకుని  వన్యమృగాల అరుపుల మధ్య నివసిస్తున్న చెంచులు ఏమైపోతారు.  నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపడితే పచ్చని చెట్లు , జంతువులు , సమస్త జీవకోటి రేడియేషన్ ప్రభావానికి మాడి మసై పోతాయి.  మానవ మనుగడకు ప్రమాదం అని తెలిసి, యురేనియం తవ్వకాల వల్ల ప్రయేజనాల కంటే అనర్దాలే ఎక్కువ అని గ్రహించిన ప్రపంచ దేశాలు అమెరికా , కెనడా, అస్ట్రేలియాలాంటి అగ్ర రాజ్యాలు తవ్వకాలను నిలిపి వేస్తుంటే భారత దేశం మాత్రం బహుళజాతి కంపనీలకు లీజుకిచ్చి యురేనియం తవ్వకాలను ఎందుకు ప్రోత్సహిస్తుంది.

వణ్య మృగ సంరక్షణ బోర్డు అనుమతులతో
కనుమరుగు కాబోతున్న ప్రాంతాలు ఇవే :
స్వాతంత్య్రం రాకముందునుంచే వ్యవసాయమే జీవనాధారంగా నివసి స్తున్న నల్లమల ప్రజలకు ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేబ డితే వారి పరిస్థితి మౌతుంది. పదర, అమ్రాబాద్ మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలు పదర, వంకేశ్వరం, ఉడిమిళ్ల, ఇప్పలపల్లి, చిట్లంచుంట, రాయలగండి, కుమ్మరోనిపల్లి, బీకె. తిర్మలాపూర్, అమ్రా బాద్, మన్ననూర్, మాచారం, గ్రామా పంచాయతీలలో దాదాపు 60 వేల జనాభా నివసిస్తున్నారు. నియోజక వర్గ ఉమ్మడి మండలాల పరిధి లో దాదాపు 10వేల మంది చెంచులు అటవీ ఉత్పత్తులున నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. యురేనియం తవ్వకాలను నిలిపివేసి గ్రా మాల లోని ప్రజలను, పెంటలలోని చెంచులను మైదానం ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను మానుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరు తున్నారు. నల్లమలలో అపారమైన ఖనిజ సంపద, వజ్రాలు, బంగారు నిక్షేపాల కోసం అడవీ ప్రాంతం మొత్తం బహుళజాతి కంపెనీలకు అప్ప గించాలనే నెపంతో వణ్య మృగ సంరక్షణ బోర్డు , డేబీర్ సంస్థతో లీసు ఖరారు చేసుకుంది. ఈ సంస్థ దాదాపు ఎటు చూసినా 83చ.మీ కి.మీ లు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టేందుకు రంగం సిద్దం చేస్తుంది. మండల పరిదిలోని ఉడిమిళ్లనుండి అమ్రబాద్ మండలం మన్ననూర్ పట్టాభ ద్రుని కోట వరకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందనే వార్త తెలుసు కున్న ఇరుమండలాల ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. దేశంలో నే అత్యంత ప్రత్యేక సాంప్రదాయ , ఆచార, వ్యవహారాలు కలిగిన ఈప్రాంత మనుగడ యురేనియం తవ్వకాలతో అంతమౌతుందేమోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

2011లోనే యురేనియం తవ్వకాలకు సర్వే :

2011 లోనే నల్లమలలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం డెబిర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వారం రోజు లపాటు హెలిప్యా డ్లద్వారా సర్వే నిర్వహించి అక్కడక్కడ గుర్తులు ఏర్పాటుచేశారు. 2012 సం॥ అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్‌లో మొదటి సారిగా బోర్లు వేయించి వచ్చిన మట్టిని పరీక్షలు నిర్వహించి యురేనియం నిల్వలు ఉన్నట్లు నిర్దారించారు. ఇది తెలుసుకున్న ప్రజలు ప్రజాసంఘాలు అక్కడి చేరుకుని డెబిర్ సంస్థకు చెందిన వాహనాలను ద్వంసం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక యురేనియం పదర మండలంలోని రాయల గండిలో ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు.


అటవీశాఖతో కుమ్మక్కై : నల్లమలలో యురేనియం తవ్వకాలకు అటవీ శాఖ అధికారులు డిబెర్ సంస్థతో కుమ్మక్కై ఇలాగైతే యురేనియం తవ్వ కాలు చేపట్టడం కష్టమౌ తుందని ప్రజలు ఆందోళన చేస్తారని వెనక్కు వెళ్లిన డిబెర్ సంస్థ 6నెలల తరువాత అటవీ అధుకారులు అక్కడక్కడా చెట్లకు నెంబర్లు వేస్తున్నామని యురేనియం నిల్వలు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. రెండవసారి ఇది తెలుసుకున్న ప్రజాసంఘాలు అక్కడికి వెళ్లి సీసీఎఫ్ అటవీశాఖ అధికారి వాహానాన్ని అడ్డుకుని ఆందోళన చేయడం తో అక్కడినుంచి అధికారులు పరారయ్యారు.
2020నాటికి 20వేల మెగావాట్ల

అణువిద్యుత్ ఉత్పత్తే కేంద్రం లక్ష్యం:


20వేల మెగావాట్లు అణువిద్యుత్ ను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుఇందన సంస్థను అదేశించింది. ప్రస్తుతం 14 అనురియాక్టర్లద్వారా 2720 మెగావాట్ల అనువిద్యుత్ ఉత్పత్తి అవుతుందని మరో 3960 మెగావాట్ల సామర్దం గల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నవి దానికితోడు 13 144 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అనుబంధ సంస్థ యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటగా నల్గొండ జిల్లాలోని చిత్రాల లో తవ్వకాలు జరిపారు. అనంతరం మేఘాలయలోని పశ్చిమ కాశీలో యురేనియం నిల్వలు ఉన్నట్లుతేలడంతో ఈ రెండు చోట్ల నిక్షేపాల తవ్వకాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే పశ్చిమకాశీలో ని ఆదివాసుల నుంచి వ్యతిరేక త ఎదురవ్వడంతో వారి ప్రయత్నంను తాత్కాలికంగా విరమించుకున్నారు.

ప్రతిఘటనకు సిద్దమౌతున్న ప్రజా సంఘాలు :


డిసెంబర్ 7న హైదరాబాద్‌లో జరిగిన అటవీశాఖ అధికారుల సమావే శంలో మంత్రి జోగురామన్న పాల్గొని యురేనియం తవ్వకాల విషయా న్ని వెల్లడించినట్లు పత్రికా ప్రకటనలోచూసి మండల పరిధిలోని వివిధ ప్రజాసంఘాల నాయకులు ప్రతి ఘటనకు సిద్దమౌతున్నారు. యురేని యం తవ్వకాలకు వణ్యప్రాణుల సంరక్షణ బోర్డు అనుమతి ఇవ్వడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం అపారమైన సంపదకోసమే బహుల జాతి కంపెనిల ప్రయేజనాల కోసమే ఈ తవ్వకాలు చేపడుతు న్నట్లు తెలిపారు .2012 లో డెడీర్ సంస్ద కు ఎదురైన చేదు అనుభవం మరల పునరావృతం కాకుండా తమ ప్రయత్నాని విరమించుకోవాలని లేకపోతే ఎన్ని పోరాటాలైన చేసి తవ్వకాలను అడ్డుకుంటామని మండలంలోని అని వర్గాల ప్రజలు,ప్రజా సంఘాల నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేఖిస్దున్నారు.