Home తాజా వార్తలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్న నల్సార్

విలువలతో కూడిన విద్యను అందిస్తున్న నల్సార్

NLASAR-1

హైదరాబాద్ : న్యాయ విద్య బోధనలో నల్సార్ లా యూనివర్సిటీ జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుందని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. నల్సార్ లా యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కెసిఆర్ మాట్లాడారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటైన రెండు దశాబ్దాల్లోనే ప్రసిద్ధి చెందిందన్నారు. నల్సార్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న నల్సార్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల కంటే ముందుందని ఆయన పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కోర్పుసలు ప్రవేశపెట్టడంలో నల్సార్ దేశంలోనే మొదటిదన్నారు. లీగల్ కోర్సులో సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశ పెట్టాలని ఆయన సూచించారు. అదనపు భవనాల నిర్మాణం కోసం 22 ఎకరాల భూమిని నల్సార్‌కు కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

Nalsar Serving Values ​​Education : CM KCR