Home ఆదిలాబాద్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ కు చుక్కలు చూపిన కానిస్టేబుల్

నమస్తే తెలంగాణ రిపోర్టర్ కు చుక్కలు చూపిన కానిస్టేబుల్

Police-copy

ఓ కానిస్టేబుల్ తన విధి నిర్వహణలో పోలీసులా కాకుండా జర్నలిస్లుగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే చందంగా వృత్తిని అడ్డుపెట్టుకుని ఓ జర్నలిస్టు సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణాను జర్నలిస్టు తరహాలోనే అడ్డుకున్నాడు. అంతేకాదు టీవీ జర్నలిస్టుల వలే సంఘటన వివరాలను తన మోబైల్ ఫోన్ లో చిత్రీకరించి అక్కడి విషయాలను వీడియోలో వివరించాడు.. తెలంగాణ ప్రాంతానికే చెందిన చింతకుంటపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన వసీం అక్రం అనే ఓ కానిస్టేబుల్ ‘‘నమస్తే తెలంగాణ’’ దినపత్రిక విలేకరి చేస్తున్న అక్రమ ఇసుక రవాణాను ధైర్యంగా అడ్డుకున్నాడు. అంతేకాదు తన చేతిలో ఉన్న యాండ్రాయిడ్ ఫోన్ లో వీడియో తీసి టివి జరల్నిస్టు చేసినట్లే యాకరింగ్ చేయడం విశేషం. ‘‘నమస్తే తెలంగాణ’’ విలేకరి తన సొంత ట్రాక్టర్ తో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక రవాణాను కానిస్టేబుల్ వసీం అక్రం పట్టుకోవడంతోపాటు, విలేకరి శ్రీనివాస్ మాట్లాడుతున్న తీరును వీడియోలో ఎండగట్టారు. ట్రాక్టర్ కు నంబర్ ప్లేట్ లేదని, విలేకరి ద్విచక్రవాహనం టిఎస్02 EH4400 హోండా షైన్ను వీడియో చూపించారు. అక్రమాలకు పాల్పడుతూనే పోలీసులను కూడా లెక్కచేయని తీరును కానిస్టేబుల్ వీడియో వివరించారు.
ఈ వీడియో సామాజిక మీడియాల్లో చెక్కర్లు కొడుతుంది. ఇప్పుడీ వీడియో హాట్ టాపిక్ గా మారింది. వసీం అక్రం తన విధి నిర్వహణలో ఎదుర్కొన్న సంఘటన పట్ల వేలాది నెటిజన్లు హర్షిస్తున్నారు. అక్రమాలకు ఎవరు పాల్పడినా తోలు తీసేయాల్సిందేనని, అక్రం లాంటి కానిస్టేబుల్ ధైర్యాన్ని మిగతా పోలీసులు కూడా వహిస్తే సమాజం కాస్తోకూస్తో బాగుపడుతుందని సోషల్ మీడియా ఖాతాదారులు పేర్కొంటున్నారు. వసీం అక్రం తన ఫోన్ లో విలేకరి శ్రీనివాస్ ను చూపిస్తూనే ఓ మీడియా ప్రతినిధి మాట్లాడినట్లు విషయాన్ని వివరించడం అందరినీ ఆకట్టుకుంది.
అయితే ఇలాంటి కానిస్టుబుళ్లను పైఅధికారులు ఏ మాత్రం ఇష్టపడరనీ, వసీం అక్రం లాంటి వ్యక్తులు పోలీస్ విభాగం ఉంటే లాలూచీపడే పోలీసు ఉన్నతాధికారుకు అడ్డుగా ఉంటాడని అతన్ని భవిష్యత్తులో ఏదోక సాకులతో సస్పెండ్ చేసే అవకాశంవుందని కూడా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే సంఘనట వసీం విషయంలో జరిగితే ఇక సమాజాన్ని అక్రమదారుల నుండి కాపాడే పోలీసుల చేతులను కట్టేసినట్లవుతుందని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు.
వసీం అక్రం లాంటి కానిస్టేబుళ్లను ప్రభుత్వం ప్రోత్సహించి సమాజంలో అక్రమదారులపై దాడులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు చెబుతున్నారు.

 యథారాజ తథాప్రజా అన్నట్లు: నమస్తే తెలంగాణ పత్రిక ప్రజల కోసం కాదని, అది అధికార పార్టీకి కరపత్రంగా పని చేస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే ఆ పత్రికా ప్రింటర్, అధినేత దీవకొండ దామోదర్ రావు ప్రభుత్వ పెద్దల అండతో వేల కోట్ల రూపాయల ఆస్తులు స్వాహా చేయగా, అదే పత్రికలో పనిచేస్తున్న ఛోటామోటా విలేకరులు తమకు అవకాశం వున్నచోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సామాజిక మీడియా కోడై కూస్తోంది.

Namasthe Telangana telugu daily Journalist arrested by Constable