Home మెదక్ పేరుకే ప్రైవేటు

పేరుకే ప్రైవేటు

జిల్లాలో అధ్వానంగా ప్రైవేటు హాస్టళ్లు
అడ్డగోలుగా వేలల్లో ఫీజుల రూపంలో వసూళ్లు
అరకొరా వసతులతో హాస్టళ్లు నిర్వహిస్తున్న యాజమాన్యం
గతంలో హాస్టళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు, దాడులు బయటకురాని మిస్టరీ
మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు

Private

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి : జిల్లాలోని కొన్ని కార్పొరేటు కళాశాలలు పైపై మెరుగులతో హాస్టళ్లను నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మెండుగా ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. ఒక విద్యార్థి హాస్టల్లో ఉండాలంటే సంవత్సరానికి 30 నుండి 35 వేల రూపాయలు చెల్లించాలి. కానీ అందుకు సరిపడ మెరుగైన వసతులు గానీ, భోజనం గానీ అందిచక డబ్బులు మాత్రం వసూలు చేస్తున్నారు. ఒకవేళ విద్యా ర్థులు సరైన సదుపాయలు లేవని ఎదురిస్తే వార్డెన్, సీనియర్లను ఉసిగొల్పి ఏదో ఒక కారణంతో విచక్షణా రహితంగా కొట్టడం, బెదిరించడం వంటి దుశ్ఛర్యలకు పాల్పడుతున్నారు. గతంలో మెదక్ పట్టణంలోని గీతా జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని చనిపోయాడు. ఇంతవరకు ఈ సంఘటనపై ఎటువంటి వివరాలు యాజమాన్యం బయటకు పొక్కనియ్యలేదు.

దీనికి కారణమేంటో అధి కారులే తెలపాలి. గత నెలరోజుల క్రితం మెదక్ పట్ట ణంలోని సిద్దార్థ్ (ఆదర్శ) ప్రైవేట్ కాళాశాల హాస్టల్‌లో జూనియర్ విద్యార్థినిని సీనియర్లు కొడుతుండగా అరుపులు బయటకు వినపడకుండా హాస్టల్ వార్డెన్ బాధితుడి నోరు గట్టిగా మూసి, తలుపు గడియ వేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఇలాంటి సంఘ టనలు జిల్లాలో తరచు జరుగుతు న్నప్పటికీ యజమాన్యాలపై అధికా రులు చర్యలు తీసుకోవడంలో విఫ లమవుతున్నా రు. ఇక హాస్టళ్ల పరి స్థితికి వస్తే విద్యార్థులు పడు కోవాలంటే వారికి ఖచ్ఛితంగా బెడ్‌లు ఉండాలి. కానీ చల్లటి చలికి నేలపైనే చాపలు పర్చుకుని వణుకుతూ పడుకోవాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. అసలు ఈ హాస్టళ్లకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఆ అనుమతులు ఎవరు ఇవ్వాలి? ఇస్తే హాస్టళ్లలో ఏఏ అధికారులు తనిఖీ చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నల కు సమాధానాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియక అప్పులు చేసి వేలల్లో హాస్టల్ ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నారు.

విద్యార్థులకు స్నానం చేయాలంటే ఒకటే స్నానపు గది అందులోనే అందరూ చేయాలి. ఇక మరుగుదొడ్ల విషయానికి వస్తే కేవలం 6 నుండి 8 మాత్రమే ఉంటాయి. సుమారు 150 మంది విద్యా ర్థులు వీటితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ విధానాన్ని కళ్లకు కనబడేలా సిసి కెమెరాలు, అద్దాల ఫర్నీచర్‌లు మాత్ర మే అమర్చి లోపల జరిగే తతంగాన్ని మాత్రం బయట కు తెలుపకుండా గుట్టుగా ఈ హాస్టళ్ల వ్యవహారం నడిపిస్తున్నారు. అధికారులు అడపదడప తనిఖీల కొరకై వస్తున్న వారిని కనీసం అటువైపుకు వెళ్లి చూడనివ్వ కుండా వారి జేబులు నింపి పంపిస్తు న్నారు. హాస్టళ్లలోని వంటశాల పరిస్థితి మరీ అధ్వానం ఇంతవరకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనే అధికారి ఉంటాడనే విషయం వంట చేసే మనిషికి కూడా తెలియదట ఎందుకంటే అతను ఎప్పుడూ తనిఖీకి రాలేదట కేవలం ఆఫీస్‌కు వచ్చి తనకు రావాల్సిన మామూళ్లు తీసుకుని అటునుంచి అటే వెళ్లిపోవడం పరిపాటైంది. దీంతో ప్రైవేట్ హాస్టళ్ల పరిస్థితి ప్రభుత్వ హాస్టళ్ల కంటే దయనీయంగా మారిం ది. నాణ్యత లేని భోజనాలతో, అర్హతలేని వార్డెన్లతో కేవలం యాజమాన్యాల నిలువు దోపిడీతో ఈ హాస్టళ్ల నిర్వహణ జిల్లాలో కొనసాగుతుంది. ఇకనైనా సంబం ధిత అధికారులు, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని విద్యార్థులపై హాస్టళ్లలో జరిగే అఘాయిత్యాలకు అడ్డుకట్టవేసి వారికి పూర్తి వసతులు కల్పించి, జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్టళ్లపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రైవేట్ హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.