Home సినిమా భర్తగా 10కి 10 మార్కులు… నటుడిగా 10కి 20 మార్కులు

భర్తగా 10కి 10 మార్కులు… నటుడిగా 10కి 20 మార్కులు

మహేష్‌బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా అంతకంటే మించి ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. కొంచెం సమయం దొరికినా చాలు భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో సమయం గడిపేందుకు ఆయన సిద్ధమవుతారు. మహేష్, నమ్రతలు ప్రేమ వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. ఆదివారంతో వారి ప్రేమ వివాహం జరిగి 14 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మహేష్ గురించి నమ్రత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

“అప్పట్లో వంశీ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లాం. ఆ సమయంలో మహేష్‌తో నాకు మంచి స్నేహం ఏర్పడింది. కానీ అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసరికి ఇద్దరం ప్రేమలో ఉన్నామని అర్థమైపోయింది. అయితే ముందు నేనే మహేష్‌కు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాను. అప్పటికే మహేష్ కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ఒకరి గురించి మరొకరికి అవగాహన ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాం”అని నమ్రత తెలిపారు. “పెళ్లి తర్వాత నటించడం ఇష్టం లేకపోవడంతో సినిమాలు చేయడం లేదు. సినిమాల్లో నటిస్తే కుటుంబానికి న్యాయం చేయలేనని భావించాను. ఇక భర్తగా మహేష్‌కు 10కి 10 మార్కులు వేస్తాను. అదేవిధంగా నటుడిగా 10కి 20 మార్కులు వేస్తాను”అని నమ్రత తెలియజేశారు.

అంధ బాలలకు విందు

సేవా కార్యక్రమాల్లో, తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు మహేష్, నమ్రత దంపతులు. తమ 14వ పెళ్లి రోజును పురస్కరించుకొని వారు తమ ఆనందాన్ని పిల్లలతో పంచుకున్నారు. 650 మంది అంధ బాలలకు ఆదివారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. బేగంపేట్‌లోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు ఈ విందు ఏర్పాటు చేయడం జరిగింది.

Namratha Interested comments on Mahesh babu