Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఎన్ టిఆర్ బయోపిక్ లో బాలయ్య.. ఫస్ట్ లుక్

Nandamuri balakrishna NTR Biopic first look

ఫిలింనగర్: క్రిష్ దర్శకత్వంలో ఎన్ టిఆర్ బయోపిక్ తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. అయితే ఈ సిన్మా ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ మంగళవారం రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్‌లో అద్భుతమైన హావభావాలతో స్టేజీపై మాట్లాడుతూ అచ్చం ఎన్ టిఆర్‌లా బాలయ్య కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన లుక్ ఎన్ టిఆర్ సిన్మాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఈ సినిమాలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తుండగా.. బాలీవుడ్ నటి విద్యాబాలన్ మఖ్య పాత్రలో నటిస్తోంది. ఎన్ టిఆర్ లో తెలుగు సిన్మా పితామహుడు, ప్రముఖ నిర్మాత హెచ్.ఎం రెడ్డి పాత్రలో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కనిపించనున్నారు. ఎన్.బి.కె. స్టూడియోస్ పతాకంపై సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి, ప్రసాద్‌లతో కలిసి బాలకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Comments

comments