Home సినిమా ‘నందమూరి ఫ్యామిలీ అందరూ ఒక్కటే’

‘నందమూరి ఫ్యామిలీ అందరూ ఒక్కటే’

ntr-kalyan-ramనందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా సాయి నిహా రిక, శరత్‌చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లిఖార్జున్ దర్శకత్వంలో కొమర వెంక టేశ్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘షేర్’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చే సిన ఎన్‌టిఆర్ బిగ్ సిడిని ఆవిష్కరించగా నందమూరి రామ కృష్ణ ఆడియో సిడిలను విడుదల చేసి మొదటి కాపీని దిల్ రాజుకు అందించారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘మల్లిఖార్జున్‌తో నాకు ఇది మూడవ చిత్రం. నేను కథను నమ్మి ఈ సినిమా చేస్తు న్నా. ఇక నందమూరి ఫ్యామిలీ అందరూ ఒక్కటే. మే ము ఎన్‌టిఆర్ అనే మహావృక్షం నుండి వచ్చాం. మమ్మల్ని వేరు చేసి మాట్లాడొద్దు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కూడా వస్తున్నాడు’అని చెప్పారు. ఎన్‌టిఆర్ మాట్లాడుతూ ‘మల్లిఖార్జున్‌తో అన్నయ్య చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావా లని కోరుకుంటున్నాను. తమన్ ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చా డు’అని అన్నారు. దర్శకుడు మల్లిఖార్జున్ మాట్లాడుతూ ‘కొమర వెంకటేష్ గట్స్ ఉన్న నిర్మాత. తమన్ మ్యూజిక్, రీరికార్డింగ్ అద్భుతంగా ఉంది. కల్యాణ్‌రామ్‌తో 12 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నా’అని తెలిపారు. కొమ ర వెంకటేష్ మాట్లాడుతూ ‘నేను ప్రొడ్యూస్ చేసే మొదటి సినిమా నందమూరి వారితో కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన కల్యా ణ్‌రామ్‌కి కృతజ్ఞతలు’అని అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, దిల్‌రాజు, సోనాల్‌చౌహాన్, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి, సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, షఫీ, రవికుమార్ చౌదరి, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.