Home తాజా వార్తలు నందమూరి హరికృష్ణ మృతి!

నందమూరి హరికృష్ణ మృతి!

Nandamuri Harikrishna Died in Road Accident

నల్గొండ: సినీ హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కామినేనిలో చికిత్స పొందుతూ ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఎపిలోని నెల్లూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్‌ వస్తున్న సమయంలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హరికృష్ణకు ముగ్గురు కుమారులు జానకీ రామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్ టిఆర్, ఒక కూతురు. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద  కుమారుడు జానకీరామ్ చనిపోయిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.