Search
Saturday 22 September 2018
  • :
  • :

ఘోర రోడ్డు ప్రమాదం.. హరికృష్ణకు తీవ్ర గాయాలు

Nandamuri Harikrishna Injured in Road Accident at Nalgonda

నల్గొండ: సినీ హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడ్డారు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద మరో వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు హుటాహుటిన చికిత్స కోసం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎపిలోని నెల్లూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్‌ వస్తున్న సమయంలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద  కుమారుడు జానకీరామ్ చనిపోయిన సంగతి తెలిసిందే. 2009లో కూడా తారక్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Comments

comments