Home తాజా వార్తలు హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

హరికృష్ణ రాజకీయ ప్రస్థానం

Nandamuri Harikrishna's Political Career in TDP

హైదరాబాద్ : నటుడు, టిడిపి అగ్రనేత నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో బుధవారం తెల్లవారుజామన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్‌టిఆర్ టిడిపిని స్థాపించిన సమయంలో ఆయన చైతన్య రథాన్ని నడిపించింది హరికృష్ణే. తనదైన శైలిలో ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 1996-99 మధ్య ఆయన ఎంఎల్‌ఎగా పని చేశారు. 1996లో రవాణా శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. 2008లో ఆయన టిడిపి తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఆయన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. టిడిపి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాక ఆయన అన్న టిడిపిని స్థాపించారు. అనంతరం టిడిపిలో మళ్లీ చేరి అనేక పదవుల్లో రాణించారు.
ఎన్‌టిఆర్, బసవతారకం నాల్గో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956లో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. తన చిన్నతనంలోనే 1967లో వచ్చిన శ్రీకృష్ణావతారం సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఆపై తల్లా … పెళ్లామా , రామ్ రహీమ్, దానవీర శూర కర్ణ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆపై కొంతకాలం ఆయన విరామం తీసుకున్నారు. తిరిగి 1998లో శ్రీరాములయ్య చిత్రంతో మళ్లీ సినిమాల్లో పునరాగమనం చేశారు. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం తదితరుల్లో నటించారు. అనంతరం ఆయన మళ్లీ సినిమాల్లో నటించలేదు.

Nandamuri Harikrishna’s Political Career in TDP