Home తాజా వార్తలు షూటింగ్‌లో గాయపడిన నందమూరి హీరో

షూటింగ్‌లో గాయపడిన నందమూరి హీరో

Kalyan-Ram

హైదరాబాద్ : తెలుగు హీరో నందమూరి కల్మాణ్ రామ్ షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం కల్యాణ్‌రామ్ జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్‌ను షూటింగ్ చేస్తుండగా కల్యాణ్‌రామ్ గాయపడ్డారు. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలిపారు. యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో కల్యాణ్‌రామ్ గాయపడ్డారని, షూటింగ్‌కు అంతరాయం కలగకుండా కల్యాణ్ రామ్ పెయిన్ కిల్లర్‌ను వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారని మహేష్ కోనేరు తెలిపారు. వృత్తిపై కల్యాణ్‌రామ్‌కు ఉన్న అంకితభావాన్ని ఆయన కొనియాడారు. ఇదిలా ఉండగా కల్యాణ్‌రామ్ ఎంఎల్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Nandamuri hero was injured in shooting