Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఉపాధి హామీ పనుల్లో బయటపడిన నంది విగ్రహం

Nandi-Statue

లింగంపేట: నంది విగ్రహం బయటపడిన ఘటన కామారెడ్డి  జిల్లాలోని లింగంపేట మండలం పోతాయిపల్లిలో శుక్రవారం ఉదయం జరిగింది. ఉపాధి హామీ పనుల్లో కూలీలు మట్టి తవ్వుతుండగా నంది విగ్రహం కనిపించిందని పోతాయిపల్లి గ్రామస్థులు పేర్కొన్నారు. మహిళలంతా నంది విగ్రహానికి కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. గ్రామస్థులతో పాటు చుట్టు పక్కల గ్రామ ప్రజలు నంది విగ్రహాన్ని చూడటానికి  తండోపతండాలుగా తరలివస్తున్నారు.

Comments

comments