Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నితిన్‌కు జోడీగా నందిత శ్వేత

Nitin

హీరో నితిన్ మళ్లీ స్పీడు పెంచాడు. ‘అ..ఆ’ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాక అతను ఆచితూచి సినిమాలు చేయడం మొదలెట్టాడు. అయితే ‘అ..ఆ’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన ‘లై’ పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం నితిన్ కొత్త దర్శకుడు కృష్ణచైతన్య రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇంకా పూర్తికాకముందే అతను మరో సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. ‘శతమానం భవతి’తో మంచి హిట్ కొట్టిన సతీష్ వేగేశ్న డైరెక్షన్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం చేయబోతున్నాడు. ఇందులో నందిత శ్వేతను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు తెలిసింది. ముందుగా ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లను పరిశీలించినప్పటికీ చివరకు నందితవైపు ఫిల్మ్‌మేకర్స్ మొగ్గు చూపించారట. ఇందులో నందితతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుంది. అయితే ఆ హీరోయిన్‌ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఈ చిత్రంలో 50 మందికి పైగా నటీనటులను తీసుకుంటున్నాడట దర్శకుడు సతీష్ వేగేశ్న. ఈ నటులతో సినిమాలో పండుగ వాతావరణం కనిపిస్తుందట.

Comments

comments