Search
Wednesday 21 November 2018
  • :
  • :

బర్త్‌డే కానుకగా టీజర్

Nani and Nagarjuna Devadas Gets Release Date

సీనియర్ స్టార్ నాగార్జున పుట్టిన రోజు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 29న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులు పుట్టిన రోజు కానుక కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల కోరికను ‘దేవదాస్’ టీమ్ తీర్చబోతోంది. నానీతో కలిసి నాగార్జున నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఫస్ట్ టీజర్ ఈనెల 29న విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మంచంపై నిద్రపోతున్న నాగార్జున, నానీ స్టిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు సినిమా యూనిట్ సోషల్ మీడియాలో ప్రీ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో నాగార్జున, నానీల నీడలు మాత్రమే కనిపిస్తున్నాయి. గోడపై చేతిలో గ్లాసుతో నాగార్జున కూర్చొని ఉండగా… కింద కూర్చున్న నాని స్మాల్ పెగ్ ప్లీజ్ అని అడుగుతున్నట్లుగా ఉంది ఈ ఫొటో. ఇక బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ సినిమాల తరహాలో ‘దేవదాస్’ ఉంటుందని నాగార్జున ఇటీవల వెల్లడించాడు. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున నటిస్తుండగా… దాస్ అనే డాక్టర్ పాత్రలో నానీ నటిస్తున్నాడు. ఆకాంక్షసింగ్, రష్మిక మందన్న కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. సెప్టెంబర్ 27న ‘దేవదాస్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments