Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నటి శ్రీరెడ్డికి నాని లీగల్‌ నోటీసులు

Nani sends legal notice to Sri Reddy

హైదరాబాద్‌ : నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది,నాని రాసలీలలు అన్నీ బయటపెడతా, నాని కాపురంలో ఇక నిప్పులే.. అని శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్‌ చేయడం టాలీవుడ్‌లో దూమారం రేపిన విషయం తెలిసిందే. నటి శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డికి నాని లీగల్‌ నోటీసులు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తుందంటూ పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చామని, ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు హాజరై ఆమె చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాని తరఫు న్యాయవాదులు సూచించారు. తనపై వస్తున్న ఆరోపణలపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ నాని ట్వీట్‌ చేశారు. ‘ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఆరోపణలు చేసిన వాళ్లు అడిగే ప్రతి అంశంపై బదులివ్వడం నాకిష్టం లేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను, వార్తలను వ్యాప్తి చేయకపోవడం మంచిది ఈ సందర్భంగా అన్నారు.

 

 

Comments

comments