Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వినాయక చవితి కానుకగా…

Sudhir-Babu

‘సమ్మోనం’తో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన సుధీర్‌బా బు హీరోగా నటిస్తూ ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా  సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మా ట్లాడుతూ “టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 13న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. సెప్టెంబర్ 12న ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. సినిమా కథ చా లా ఫ్రెష్‌గా ఉంటుంది.  కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేష్ చా లా బాగా చేసింది”అని అన్నారు. నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: అజనీష్ బి.లోకనాథ్, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి.

Comments

comments