Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సుధీర్ బాబు నిర్మాతగా ‘నన్ను దోచుకుందువటే’

sudheer

హైదరాబాద్‌:ఇటీవల విడుదలైన ‘సమ్మోహనం’ సినిమాతో మంచి విజయం అందుకున్న సుధీర్‌బాబు ఇప్పుడు నిర్మాతగా మారారు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ రూపొందిస్తున్న తొలి సినిమాలో ఆయనే కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను తాజాగా  ప్రకటించారు.ఈ సినిమాకు ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ అందమైన పల్లెటూరులోని పొలంలో కారుపై కథానాయకుడు, నాయిక కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూపించారు. ఆర్‌ఎస్‌ నాయుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్‌ కథానాయికగా నటిస్తుంది.

 

Comments

comments