Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేశ్

LOKESHహైదరాబాద్ : ఎపి సిఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆయన కుమారుడు, టిడిపికార్యకర్తల సంక్షేమనిధి కర్త నారా లోకేశ్ శనివారం ప్రకటించారు. టిడిపి అధినేత, ఎపి సిఎం ఆస్తుల విలువ రూ.42లక్షలు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.౩౩.7 కోట్లు, లోకేశ్ ఆస్తుల విలువ రూ.7.67 కోట్లు, బ్రహ్మణి ఆస్తుల విలువ రూ.4.77 కోట్లుగా ప్రకటించారు. నిర్వహణ హోల్డింగ్స్ ఆస్తులు రూ.1.౩7 కోట్లుగా తెలిపారు. తమ ఆస్తుల వివరాలన్నీ కొనుగోలు విలువ ఆధారంగా ప్రకటిస్తున్నట్టు లోకేశ్ వెల్లడించారు. హెరిటేజ్ ద్వారానే తమ కుటుంబానికి ఆదాయం వస్తుందనిఆయన పేర్కొన్నారు. హెరిటేజ్ విలువ రూ.9.13కోట్లు కాగా, ఖర్చులు పోనూ హెరిటేజ్‌కు ఏటా రూ.30 కోట్లలాభం వస్తుందని ఆయన తెలిపారు. రాజకీయాలను కొందరు నేతలు అవినీతిమయంగా మార్చారని లోకేశ్ ఆరోపించారు. తాము ప్రకటించిన వాటికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు నిరూపిస్తే,వారికే ఇస్తామనిఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి హెరిటేజ్ కోసం ఎలాంటి రాయితీలు పొందలేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments