Home వార్తలు నారా రోహిత్ పాడిన స్పెషల్ సాంగ్ విడుదల

నారా రోహిత్ పాడిన స్పెషల్ సాంగ్ విడుదల

Nara-Rohith-Savitriనారా రోహిత్, నందిత హీరోహీరోయిన్‌లుగా నటించిన సినిమా ‘సావిత్రి’. పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిమ్ మేకర్ బ్యానర్‌పై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిత్ర కథానాయకుడు రోహిత్ స్వయంగా పాడిన స్పెషల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ‘మార్ మార్ తీన్‌మార్… గుండెజారి తీన్ మార్’ అంటూ సాగే ఈ పాటను వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, నందిత, రాజేంద్రప్రసాద్, మధు, వసంత్, శ్రావణ్, అజయ్, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్మాత డా.వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ఎలాంటి ద్వందార్థాలు లేని సంభాషణలతో ఆహ్లాదకరంగా ఉండే చిత్రమిది. రోహిత్ చాలా చక్కగా పాట పాడారు. దర్శకుడు పవన్ పనితనం అద్భుతం. చైతన్య డైలాగ్స్ హైలైట్స్‌గా ఉంటాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. మార్చి 4న ఆడియో, అదే నెల 25న సినిమాను రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ “సోలో తర్వాత ‘సావిత్రి’ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందన్న నమ్మకముంది. ఈ చిత్రానికి డిఓపి వెరీ స్పెషల్‌గా ఉంటుంది. కృష్ణచైతన్య మరోసారి నా సినిమాకు మంచి మాటలు అందించారు. పాటలు కూడా రాశారు. నేను పాడిన పాట అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా”అని అన్నారు. దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ “చక్కని ఫ్యామిలీ కంటెంట్‌తో ఈ సినిమా తీశాను. తెలుగుతనం కనిపించాలని చేసిన సినిమా ఇది. శ్రావణ్ అందించిన అద్భుతమైన సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు, కృష్ణచైతన్య, నందిత తదితరులు పాల్గొన్నారు.