Search
Friday 21 September 2018
  • :
  • :

ఆ హత్యకు పోలీసులే భాధ్య వహించాలి

butta-renuka

కర్నూలు: నాయకుల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసుపైనే ఉందని వైఎస్ఆర్ సిపి లోక్ సభ సభ్యురాలు బుట్టా రేణు ఆరోపించారు. నారాయణరెడ్డిని ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. నారాయణరెడ్డి తాను నిన్ననే కలిసి వైసిపి ప్లీనరీ సభల ఏర్పాటు గురించి చర్చించుకున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని ఓడించే సత్తా ఉన్న నారాయణరెడ్డిని ప్రత్యర్థులు వ్యూహంతోనే హత్యచేశారని అన్నారు.

నారాయణరెడ్డి రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గం నుండి గెలిచే వ్యక్తి అని భావించి టిడిపి నాయకులే అదునుచూసి దారుణహత్యకు పాల్పడ్డారని వైసిపి ఎంఎల్ఎ ఐజయ్యా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అండదండలతోనే టిడిపి గూండాలు రెచ్చిపోతున్నారని ఆయన ఆరోపించారు.

(Video Tv5 సౌజన్యంతో)

Narayana Reddy was killed by the instructions of Chandrababu

Comments

comments