Home ఆంధ్రప్రదేశ్ వార్తలు విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్!

విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్!

Narayana-Schoolఅమరావతి: ఎపిలో గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సత్యనారాయణపురంలో సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గతంలో పాఠశాల యాజమాన్యానికి మూడు సార్లు నోటీసులు ఇచ్చిన వారి వైఖరి మారకపోవడంతో స్కూల్ సీజ్‌ చేయడంతో పాటు 1 లక్ష రూపాయల జరిమానా విధించామని అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రైవేటు కళాశాలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ వేయడంతో పాటు అర్హులైన పేదవారికి ‘అమ్మ ఒడి’ ద్వారా ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన వైఎస్‌ జగన్‌ సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తొలి కేబినేట్‌ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలపై రెగ్యులేటరీ కమిషన్‌ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Narayana School seized in Satyanarayanapuram in AP