Home తాజా వార్తలు రాజేంద్రనగర్‌లో 1020 కిలోల గంజాయి స్వాధీనం

రాజేంద్రనగర్‌లో 1020 కిలోల గంజాయి స్వాధీనం

Cannabisహైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నార్కోటిక్ అధికారులు 1020 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బొగ్గు మిశ్రమంలో గంజాయి పెట్టి తరలిస్తున్నట్లు అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో రాజేంద్రనగర్‌లోని బిలాల్ ఈద్గా నుంచి ట్రక్కును వెంబడించి పట్టుకున్నారు. బీదర్ కు చెందిన ట్రక్కు డ్రైవర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 4,557 కిలోల గంజాయి పట్టుబడినట్టు అధికారులు వెల్లడించారు.

Narcotics Officials caught 1020 kg of Cannabis in Rajendranagar