Home జాతీయ వార్తలు ఎపి అభివృద్ధికి ప్రధాని హామీ

ఎపి అభివృద్ధికి ప్రధాని హామీ

MODIగుంటూరు : విభజన చట్టంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ప్రధాని నరేంద్రడమోడీ స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఎపి రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో మోడీ ప్రసంగించారు. ఎపి నిర్మాణంలో చేయిచేయి కలిపి నడుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎపిలో సమస్యలను పరిష్కరించి , ఆ రాష్ట్రాన్ని ఉన్నతశిఖరాలకు తీసుకెళుతామని ఆయన ఉద్ఘాటించారు. 20 నిమిషాల పాటు మోడీ ప్రసంగించారు. మోడీ ప్రసంగాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా మోడీ విభజన విషయంలో కాంగ్రెస్ నిర్లక్షం ఇతర అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సిఎం కెసిఆర్, కేంద్రమంత్రులు, ఎంపిలు, రైతులు, ఎమ్మెల్యేలు, మంత్రులు , భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.