Home అంతర్జాతీయ వార్తలు మావో మెచ్చిన చోట మోడీ-జీ మాట.. ముచ్చట

మావో మెచ్చిన చోట మోడీ-జీ మాట.. ముచ్చట

 narendra modi meet with mao jobdango

వుహాన్: గుజరాత్‌లోని మహాత్మాగాంధీ సబర్మతి ఆశ్రమంలో 2014లో తొలిసా రి అనధికారికంగా సమావేశమైన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు చైనా విప్లవ నాయకుడు  మావో జేడోంగ్‌కు ఎంతో ఇష్టమైన వుహాన్‌లో  శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు మనసు విప్పి మాట్లాడుకోనున్నారు. ఈ అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం అంతర్జాతీయ , ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై ముఖాముఖి మాట్లాడుకుంటారని అధికారులు అంటున్నారు. ఇరువురు నేతలు ఎక్కువ సేపు గడిపే నగరంలోని ఈస్ట్ లేక్ మావోకు అత్యంత  ఇష్టమైన  హాలిడే  స్పాట్. మావో తరచూ ఈతకొట్టే  యాంగ్జీ నదికి పక్కనే అందమైన పెద్ద పార్కు కూడా ఉంది. ఈ ప్రాంతంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన మావో హాలిడే విల్లా కూడా ఉంది. ప్రస్తుతం మెమోరియల్‌గా మార్చిన ఈ విల్లాలోని విశేషాలను జీ మోడీకి చూపించనున్నారు. అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో, చుట్టుపక్కల గాంధేయ ఆలోచనలను వివరించడంలో జీకి మోడీ గైడ్‌గా వ్యవహరించగా, ఇప్పుడు వుహాన్‌లో జీ అదే పాత్ర పోషించనున్నారు.

ఇరువురు నేతల అనధికారిక శిఖరాగ్ర సమావేశం వివరాలను అధికారికంగా వైల్లడించనప్పటికీ ఇరువురు నేతలు ఈస్ట్‌లేక్‌లో బోటు షికారుతో పాటు, నడుస్తూ మాట్లాడుకుంటారని, ఆ సమయంలో వారి అనువాదకులు మాత్రమే వెంట ఉంటారని అధికారులు చెప్తున్నారు. గురువారం సాయంత్రం ఇక్కడికి రానున్న మోడీ శుక్ర, శనివారాల్లు జీతో ఎలాంటి అరమరికలు లేకుండా చర్చలు జరుపుతారని అధికారులు అంటున్నారు. సరిహద్దు సమస్యతో పాటు, ద్వైపాక్షిక సంబంధాలను వెంటాడుతున్న పలు సమస్యల పరిష్కారంలో పురోగతి సాధించగలిగితే ఈ చర్చలు ఒక గొప్ప మలుపు అవుతాయని విశ్లేషకులు అభిపాయ్ర పడుతున్నారు. వుహాన్‌లో మోడి విడిది భారతీయులక అంచనాలకు మించి ఉంటుందని, అనధికారిక శిఖరాగ్ర సమావేశం ఒకకొత్త ప్రారంభం అవుతుందని మోడీ పర్యటనకు ముందు చైనా అధికారులు చెప్పారు. వుహాన్‌లో మోడీ అత్యంత సుఖవంతమైన ప్రదేశంలో ఉంటారని ఈ వారం ప్రారంభంలో చైనా విదేశాంగ మంత్రి కోంగ్ జువాన్యోయు చెప్పారు. అయితే మోడీ ఎక్కడ బస చేస్తారో మాత్రం ఆయన వెల్లడించలేదు.

ఇరువురు నేతలు వుహాన్‌లో రెండు రోజులు ఉంటారని, ఈ రెండు రోజులు ఇరువురు నేతలు ఎక్కువ సేపు కలిసే ఉంటారని కూడా ఆయన చెప్పారు.ఇలాంటి ఏకాంత సమావేశాలు ఇతర దేశాల్లో కనిపించవని కూడా ఆయన చెప్పారు. అయితే ఇరువురు నేతల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరే అవకాశాలు లేవని ఇరుదేశాల అధికారులు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు సాగడానికి అవసరమైన స్థూల నిబంధనావళిని ఇరువురు నేతలు నిర్ణయిస్తారని భారత అధికారులు చెప్పారు. అయితే మోడీ ప్రస్తుత చైనా పర్యటనను 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ జరిపిన చరిత్రాత్మక తొలి చైనా పర్యటనతో పరిశీలకులు పోల్చుతుండడం గమనార్హం. 1955లో తొలి ప్రధాని నెహ్రూ తర్వాత 34 ఏళ్లకు చైనావెళ్లిన మొదటి ప్రధానిగా రాజీవ్ పర్యటనకు ప్రాధాన్యత లభించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చైనా సందర్శించడం ఇది నాలుగో సారి.