Home అంతర్జాతీయ వార్తలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ భేటీ…

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ భేటీ…

modi

సోసి :రష్యాలో పర్యటిస్తున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పునిత్ తో భేటీ అయ్యారు. సోచీ నగరంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.  భారత్, రష్యా దేశాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉందని ప్రధాని పేర్కొన్నారు. అనధికార సమావేశానికి ఆహ్వానించినందుకు పుతిన్ కి మోడీ కృతజ్ఞతలు తెలిపారు.  ఎస్ సిఒలో భారత్ కు శాశ్వత సభ్యత్వం దక్కడంలో రష్యా ముఖ్యపాత్ర పోషించిందని మోడీ తెలిపారు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్, బ్రిక్స్ సమావేశాల్లోనూ దేశాలు కలిసి పనిచేశాయని ప్రధాని గుర్తు చేశారు.