Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విషాదంతో ముగిసిన నరేశ్-స్వాతి ప్రేమ కథ

Love

యాదాద్రి: వలిగొండ మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నరేశ్-స్వాతి ప్రేమ కథ విషాదంతో ముగిసింది. నరేశ్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హంతకులు స్వాతి పొలంలోనే నరేశ్‌ను చంపి కాల్చేశారు. నరేశ్ శవాన్ని స్వాతి పొలంలోనే పూడ్చిపెట్టారు. స్వాతి కుటుంబ సభ్యులే నరేశ్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్వాతి తండ్రిని శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మే-1 నుంచి నరేశ్ కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. మే-16న స్వాతి ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి, బాబాయ్, బాబాయ్ కొడుకులను నిందితులుగా పోలీసులు గుర్తించారు.

 

Courtesy by TFC news

Comments

comments