Home తాజా వార్తలు శివాజీరాజా సమాధానం చెప్పాలి: నరేష్

శివాజీరాజా సమాధానం చెప్పాలి: నరేష్

Naresh responds to MAA controversy

హైదరాబాద్: ‘మా’ ఆఫీసులో నిధుల గోల్ మాల్ పై సినీ నటుడు నరేష్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మా ఆఫీసులో ఏడాది పాటుగా సమావేశాల దృశ్యాలు రికార్డు కాలేదని, ఈ ఆరోపణలపై శివాజీరాజా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నరేష్ అన్నారు. తన తల్లి విజయ నిర్మల పుట్టిన రోజున ‘మా’కు ఏటా రూ.75వేలు ఇస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకూ ఆమె రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారని అన్నారు. మా సభ్యులు బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌తో అమెరికా వెళ్లడం దారుణమన్నారు. ‘మా’ నిధుల గోల్‌మాల్‌పై మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుంచి శివాజీరాజా కనిపించడం లేదని ఆయన అన్నారు.‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజీరాజా ఆ సంఘం నిధులను మింగేశాడని నరేష్ ఆరోపించారు. మెగా ఈవెంట్‌తో వచ్చిన నిధి నుంచి కొంత దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.నిధుల గోల్‌మాల్‌పై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని నరేష్‌ డిమాండ్ చేశారు.