Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

నేడే నాసా చరిత్రాత్మక ప్రయోగం…

సూర్యుని చెంతకు పార్కర్ సోలార్ ప్రోబ్

Solar Probe

నాసా పార్కర్ సోలార్ ప్రోబ్‌ను శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రయోగించారు. సూర్యుడ్ని తాకి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి 1.5 బిలియన్ డాలర్లతో ఈ ప్రాజెక్టును ‘నాసా’ రూపొందించింది. 430,000 మైళ్ల వేగంతో ఈ హ్యోమ నౌక దూసుకెళ్లి అత్యంత ఆశ్చర్యకరమైన 2500 డిగ్రీల ఉష్ణోగ్రతను చేరుకోవలసి ఉంటుంది. సూర్యుడ్ని స్పృశించడం అంత సులువు కాదు. అసాధారణ వాతావరణంతో ప్లాస్మా వేడి జ్వాలలతో అయస్కాంత క్షేత్రాలతో ఆవరించి ఉంటుంది. నాసా తన కారు సైజు పార్కర్ సోలార్ ప్రోబ్ (పిఎన్‌పి)ను 24సార్లు అంత కన్నా ఎక్కువగా సూర్యుడ్ని చుట్టూ పరిభ్రమించి అధ్యయనం చేయడమే లక్షంగా పెట్టుకుంది. సూర్యుని 4 మిలియన్ మైళ్ల పరిధిలో అంచులను తాకాలని ప్రయత్నం, దీనివల్ల సూర్యుని ఆవరించిన వాతావరణం, సౌర వాయువు, ఇతర లక్షణాలు అధ్యయనం చేయడానికి వీలవుతుంది. ప్రోబ్ సేకరించిన సమాచారం అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్తలకు తీవ్రమైన సౌర ఉత్పాతాలు, ముందుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సౌర ఉత్పాతాల వల్ల ఎలక్ట్రికల్ గిడ్స్, శాటిలైట్లు, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలు చాలా దెబ్బతింటాయి. అదే జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. వాతావరణం అనుకూలిస్తే కారు సైజు ప్రోబ్ (వ్యోమనౌక)ను ఫ్లోరిడా తీరం నుంచి శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆవిష్కరిస్తారు. అయితే నాసా మాత్రం ఆగస్టు 23న ప్రోబ్‌ను ప్రయోగించాలని భావిస్తోంది. కొన్ని నెలల తరువాత పిఎస్‌పి (ప్రోబ్) సూర్యుడ్ని చేరుకొంటుంది. సూర్యుని చుట్టూ భూమి 67000 మైళ్ల వేగంతో కక్షలో పరిభ్రమిస్తోంది. అయితే సూర్యుని వైపు వెళ్లాలంటే పిఎస్‌పి 53వేల మైళ్ల వేగానికి తగ్గాలని ‘నాసా’ పేర్కొంది.

 మన తెలంగాణ, సైన్స్ విభాగం

Comments

comments