Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

రోదసీ కొత్త సూక్ష్మజీవికి కలాం పేరు పెట్టిన నాసా

nasa

లాస్ ఏంజెల్స్: అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)లో పనిచేస్తున్న శాస్త్రజ్ఞులు కొత్తగా కనుగొ న్న రోదసీ సూక్ష్మజీవికి భారతీయలు బాగా అభిమానించే రోదసి శాస్త్రజ్ఞుడు  ఎపిజె అబ్దుల్ కలాం పేరును పెట్టారు. ఇది  భారత్‌కు ఓ శుభవార్త అనడంలో సందేహం లేదు. భూమి మీద కాకుండా  కేవలం అం తర్జాతీయ రోదసీ కేంద్రం(ఐఎస్‌ఎస్)లో మాత్రం కనిపించే ఓ సూక్ష్మ జీవి (బ్యాక్టీరి యా)ను వారు  కనుగొన్నారు. నాసాలో ప్రధాన ప్రయోగశాల అయిన జెట్ ప్రొపల్షన్ లాబొ రేటరీ(జెపిఎల్) పరిశోధకులు ఐఎస్‌ఎస్ ఫిల్టర్స్‌పైన ఈ కొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. దీనికి సోలిబెసిల్లస్ కలామీ అన్న పేరును పెట్టారు. సోలిబెసిల్లస్ అనేది జనన పేరు (జెనస్ నేమ్)కాగా కలామీ అన్నది డాక్టర్ అబ్దుల్ కలామ్ పేరుకు ప్రతిరూపం. ఫిల్టర్‌పై కనుగొన్న ఆ సూక్ష్మజీవి ఐఎస్‌ఎస్ బోర్డ్‌పై 40 నెలలు ఉంది. ఈ ఫిల్టర్‌ను తర్వాత ఈ ఏడాదే విశ్లేషించారు. తాను కనుగొన్న ఈ సూక్ష్మజీవి గురించి సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ కస్తూరీ వెంకటేశ్వరన్ ‘సిస్టమేటిక్ అండ్ ఎవా ల్యూషనరీ మైక్రో బయాలజీ ’అంతర్జాతీయ పత్రికలో ప్రచురించారు. ఇప్పటి వరకు సోలీబెసిల్లస్ కలామీని భూమిపై  ఎప్పుడూ కను గొనలేదని, అయితే వాస్తవానికి అది గ్రహాం తర(ఇటి) జీవి ఏమి కాదని తెలిపారు. సాధారణంగా కొత్త బ్యాక్టీరియా లకు శాస్త్రజ్ఞుల పేర్లు పెడుతుంటారు. ‘ఈ విశ్వంలో మనమే ఉన్నామా?’ అనే అంశం పై పరి శోధన చేస్తున్న శాస్త్రజ్ఞుల బృందంలో వెంకటేశ్వరన్ ఒకరు. హానికారక సూక్ష్మజీవులు భూమిపైకి వ్యాపిం చకుండా రోదసీ కేంద్రం పర్యావరణను పర్యవేక్షించే ప్రధాన పనిని ఆయన చేస్తుంటారు.

‘ఈ కొత్త సూక్ష్మ జీవులు అత్యంత ధార్మిక త(హై రేడియేషన్)ను తట్టుకుం టున్నాయి. పైగా కొన్ని ఉపయోగకర ప్రొటీన్ కాంపౌండ్లను తయారుచేస్తు న్నాయి. ఇది బయోటెక్నాటజీ అప్లికేషన్స్‌కు తోడ్ప తా యి’ అని వెంకటేశ్వరన్ తెలిపారు. ఈ  కొత్త బ్యాక్టీరియాను పూర్తి స్థాయిలో ఆయన బృందం నిర్ధరించ లేదు. అయితే అది రేడియేషన్ ధ్వంసానికి వ్యతి రేకంగా ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు  భావిస్తున్నారు.

NASA named after the new microorganism kalam

Comments

comments