Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

అంతరిక్షంలో గోధుమ పంట

image

అంతరిక్షంలో గోధుమ పంటను పండించేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు  దీని కోసం స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని అభివృద్ధి చేస్తున్నారు.  ఈ పద్ధతి వల్ల మూడు రెట్లు వేగంగా పంట పెరుగుతుంది. గోధుమ పంటపై నిరంతరం వెలుగును ప్రసరింపజేయడం వల్ల  త్వరగా పెరగుతుంది. పంట త్వరగా చేతికి వస్తుందంటున్నారు. ఈ పరిశోధన కోసం ఆరు తరాల గోధుమ, బార్లీ పంటలపై ప్రయోగాలు చేసినట్లు పరిశోధకులు క్వీన్స్ విశ్వవిద్యాలయ పరిశోధక శాస్త్రవేత్త లీహికీ తెలిపారు. గాజు గదుల్లో వీటిపై ప్రయోగాలు చేస్తున్నా మన్నారు. 2050 సంవత్సరానికి భూమి మీద దాదాపు 60 నుంచి 80 శాతం ఎక్కువ ఆహారాన్ని తొమ్మిది బిలియన్ల మందికి అందించాల్సి ఉందని అంచనావేశారు. ఇందుకోసం పంటల ఉత్పాదన పెంచాల్సి ఉంది. డో ఆగ్రో సైన్సెస్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని డీ ఫెరడే గోధుమ రకాన్ని తయా రుచేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది అధిక ప్రోటీన్లు కలిగి ఉన్న తృణధాన్యం అన్నారు. దీంట్లో గోధుమ కూడా కల్సి ఉండటం వల్ల అధిక పోషకాలు కలిగి ఉంటుందన్నారు.

Comments

comments