Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కేరళ వానలపై నాసా శాటిలైట్ వీడియో

NASA satellite video on Kerala rains

హూస్టన్: ఎడతెరపి లేని వానల కారణంగా కేరళతోపాటు కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా భారత్ లో కురిసిన భారీ వర్షాల తాలూకు శాటిలైట్ డేటాను ఉపయోగించి నాసా ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ఆధారంగా  కేరళలో కురిసిన వర్షాలపై ఓ అంచనా వస్తుంది. సాధారణంగానే ఈ సమయంలో ఇండియాలో భారీ వర్షాలు పడుతుంటాయి. అయితే, దీంతో పాటు అల్పపీడనాల వల్ల మరిన్ని భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళ గత వందేళ్లలో ఎప్పుడు చూడని జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. 231 మంది ఈ వరదల్లో చనిపోయాగా.. కొన్ని లక్షల మంది తమ ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న విషయం విదితమే. ఆగస్టు 13 నుంచి 20 వరకు భారత్ లో భారీ వర్షాలు కురిసినట్టు నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసినట్టు నాసా వెల్లడించింది. నాసా శాటిలైట్ ప్రతి అరగంటకోసారి డేటాను పంపుతుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా  కురుస్తున్న వర్షపాతంపై శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని నాసా వెల్లడించిది.

Comments

comments