Home నవ విజ్ఞానం అంతరిక్షంలో లీకవుతున్న భూవాతావరణం

అంతరిక్షంలో లీకవుతున్న భూవాతావరణం

NASA sounding rocket

 

వాషింగ్టన్ : భూమి వాతావరణం ఎలా మెల్లగా పగిలి అంతరిక్షంలోకి చొచ్చుకుపోతోందో కనుగొనడానికి నాసా సౌండింగ్ రాకెట్‌ను రూపొందించింది. దీన్ని నాలుగోతేదీకే ప్రయోగించాలని గడువు పెట్టుకుంది. శాస్త్రీయ వ్యోమనౌకల్లో సౌండింగ్ రాకెట్ నైపుణ్యపరంగా అసమానమైనది. ఇది ఎటువంటి మారుమూల ప్రాంతాలకైనా వెళ్లగలదు. స్వల్సకాల సంఘటనలను కూడా పరిశోధిస్తుంది. ఎటువంటి గ్రహాలు నివాసయోగ్యమో అంగారక గ్రహం వంటి గ్రహాలు ఎందుకు నివాసయోగ్యానికి దూరంగా ఉంటున్నాయో ఇవన్నీ సౌండ్ రాక్‌ట్ పరిశోధిస్తుంది.

విజన్స్2 మిషన్స్‌గా ఈ ప్రయోగాన్ని వ్యవహరిస్తున్నారు. ఉత్తర ద్రువ ప్రాంత ఆకాశంలో నుంచి వెలువడే అరోరా కాంతి కిరణాలను పరిశోధించాలన్న ఆసక్తిని విజన్ 2 చూపిస్తోంది. వాతావరణం లీక్ అవడంలో అరోరా సిద్ధాంత పరంగా కీలక పాత్ర వహిస్తోంది. భూమితో సహా గ్రహాలు క్రమంగా తమ వాతావరణాన్ని వదులుకొంటున్నాయి. ఎక్కడైనా వంద నుంచి అనేక వందల టన్నుల వాతావరణం అంతరిక్షం లోకి ప్రతిరోజూ చేరిపోతోందని నాసా స్పేస్ భౌతిక శాస్త్రవేత్త థామస్ మూర్ అన్నారు. అదే స్థాయిలో భూగోళం తన వాతావరణాన్ని బిలియన్ నుంచి కొన్ని బిలియన్ల సంవత్సరాలకు తిరిగి పొందగలుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

శక్తివంతమైన ఎలెక్ట్రాన్లు భూమికి చేరువగా ఉన్న అంతరిక్షంలో విద్యుత్, అయస్కాంత క్షేత్రాలలో ఉత్తేజమై వాతావరణ వాయువులతో ఘర్షణ పడతాయి. అప్పుడు గాఢమైన ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగుల కిరణాలు ఏర్పడతాయి. అవి తిరిగి తక్కువ శక్తివంతమైన స్థాయికి చేరుకుంటాయి. ఈ ఎలెక్ట్రాన్లు కూడా ప్రళయాన్ని సృష్టిస్తుంటాయి. విద్యుత్ తరంగాలను అవి ఉపరితల వాతావరణం వేడెక్కించేలా చేస్తాయి. ఈ అపూర్వ ప్రక్రియను పరిశోధించడమే తన లక్షంగా విజన్2 పెట్టుకుంది.
– మన తెలంగాణ/సైన్స్ విభాగం

NASA sounding rocket about planetary habitability

Telangana Latest News