Home నవ విజ్ఞానం బృహస్పతి చంద్రునిపై తవ్వకానికి నాసా టన్నెల్‌బోట్

బృహస్పతి చంద్రునిపై తవ్వకానికి నాసా టన్నెల్‌బోట్

NASA Spies

 

నాసా శాస్త్రవేత్తలు బృహస్పతి చంద్రుల్లో ఒక చంద్రుని ఉపరితలాన్ని దొలిచి గ్రహాంతర వాస జీవనానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా కనీసం సూక్ష్మజీవుల ఉనికైనా ఉండేదా లేదా అని తెలుసుకోడానికి అణువిద్యుత్తు శక్తి కలిగిన టన్నెల్ బోట్ అనే పరికరాన్ని రూపొందించారు. బృహస్పతి చంద్రుల్లో ఒకటైన యూరోపా పై ద్రవ సముద్రంలో సూక్ష్మజీవి ఉనికి ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే మంచుపొర దళసరి 18.6 మైళ్ల పొడవునా విస్తరించి ఉంటుందని అదే పెద్ద సమస్యని వారు భావిస్తున్నారు. అయితే తమ టన్నెల్ బోట్ మంచు ఉపరితలం లోంచి దొలుచుకుని ఎలా వెళ్తుందో నాసా పరిశోధక బృందం అంచనా వేస్తోంది. పరిశోధకులు ఎవరైనా ఈ సమస్యను అధిగమించ వలసిందేనని చెబుతున్నారు. మంచులో ఎలా కూరుకుపోతుందో అన్న దానిపై తమకు ఎలాంటి ఆందోళన లేదని అక్కడ లోతుగా ఉన్న సముద్రంలో ఎలా పనిచేస్తుందో అని తాము సమీక్షిస్తున్నామని అన్నారు.

ఆ చంద్రుని సరస్సుల్లో అంతరించి పోయిన ప్రాణి చిహ్నాలను వెతకడానికి కావలసిన పరికరాలను, సాధనాలను ఈ టన్నెల్ బోట్ తీసుకు వెళ్తుందని చెప్పారు. రెండు డిజైన్లతో ఈ బోట్‌ను రూపొందించారు. మొదటిది న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా పవర్ పొందుతుంది. రెండవది రేడియో యాక్టివ్ హీట్ వనరుగా ఉపయోగపడుతుంది. ఈ ఆధారాల ద్వారానే వచ్చే వేడి పైకప్పు మంచును కరిగించ గలుగుతుంది. ఈ బోట్ రీపీటర్స్‌గా, ఫైబర్ ఆప్టికల్స్‌గా పనిచేసి భూమితో అనుసంధానం కలిగి ఉంటుంది. మంచు పొర ద్వారా బోట్ నమూనాలను సేకరిస్తుంది. నీటి నమూనాలతోపాటు మంచు గడ్డ నీటి నమూనాలను కూడా సేకరిస్తుంది. మంచు లోపలి భాగంలో సూక్ష్మజీవి ఉనికి ఏదైనా ఉందా అని పరిశోధిస్తుంది. నాసా గెలీలియో వ్యోమనౌక 1995 నుంచి 2003 మధ్యకాలంలో బృహస్పతి చంద్రుడు ఐరోపాను చేరుకోడానికి అనేక ప్రయత్నాలు చేసింది. సమీపం నుంచి ఐరోపా మంచుపొర అడుగున సూక్ష్మజీవి ఉనికి ఉందా అని పరిశీలించింది. అడుగున చాలా మందంతో విశాలమైన మంచు కప్పు ఉండడం, అక్కడ నీరు శిలలతో కలసి ఉండడం కనిపించింది. అందుకనే సూక్ష్మజీవుల ఉనికి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించడానికి ఆస్కారం కలిగింది.

                                                                                                                 – సైన్స్ విభాగం

NASA Spies Jupiter Moon Erupting Water Vapor

Telangana Latest News