Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఊరికే పడుకుంటే.. లక్షలో జీతమిస్తారటా..!!

Bed-Rest-Studyఊరికే తిని, పడుకుంటే జీవితంలో బాగుపడవు అని మన పెద్దవాళ్ల తిడుతుంటారు… కానీ ఆ నిద్రే లక్షల్లో ఆదాయం తెస్తే.. ఎంత బాగుంటుందో.. అది కూడా మీకో టివి, వీడియో గేమ్, మొబైల్ ఫోన్ వంటివి ఇస్తూ.. పడుకున్నందుకు డబ్బులు కూడా ఇస్తే.. అహా అంతకన్న సుఖమే లేదు.. ఇవి వుట్టి మాటలు అనుకోకండీ.. ఇది అక్షరాల నిజం. అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
నాసా చేస్తున్న ఓ తాజా పరిశోధనలో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పరిశోధనని ‘బెడ్ రెస్ట్ స్టడీ’ అని అంటారు. ఈ ప్రయోగంలో పాల్గొనే వాళ్లు చేయాల్సిందల్లా.. 89 రోజుల పాటు మంచంపై పడుకోని ఉండటమే… అక్కడి సిబ్బంది మీకు అన్ని సదుపాయాలను మంచం వద్దనే కల్పిస్తారు. భోజనం, టివి, మొబైల్, వీడియో గేమ్, చదువుకోవడానికి పుస్తుకాలు వగేరా.. వగేరా…మీరు ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే.. మీకు 8వేల డాలర్ల నుంచి 18వేల డాలర్ల వరకూ (నెలకు) జీతం ఇస్తారు. అయితే ఇందులో ఓ చిక్కుముడి కూడా ఉంది.. అదేంటంటే.. ఈ 87 రోజుల కాలంలో మీరు అస్సలు మంచం దిగకూడదూ.. మిమ్మల్ని కలవానికి వచ్చిన వాళ్లుకూడా మంచం దగ్గరికి వచ్చి కలవాల్సిందే..
ఈ ప్రయోగం ఎందుకంటే.. మనిషి పడుకున్నప్పుడు అంతరిక్షంలోలా శరీరం జీరో గ్రావిటీ స్థితిలో ఉంటుంది. అప్పుడు మన శరీరంలోని కండరాలు, రక్త కణాలు, నరాలుపై ఎలా పనిచేస్తాయని తెలుసుకోవడమే ఈ ప్రయోగం లక్షం. పూర్తిగా 89 రోజుల పాటు ఈ ప్రయోగం కొనసాగుతుంది. మొదటి 15 రోజులు పార్టిసిపెంట్ సాధారణంగా ఉండొచ్చు, తర్వాత 60 రోజులు మాత్రం పడుకొనే ఉండాలని, ఆఖరి 14 రోజుల్లో కండరాల శక్తిని రికవరీ చేసి శరీరాన్ని తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొస్తారు. ఇది విన్న కొందరు ఆశ్చర్యానికి గురైన.. మరి కొందరు మాత్రం దీనికి సై అంటున్నారు.. కొందరు ఇప్పటికే ఈ ప్రయోగంలో పాల్గొని సర్టిఫికేట్లు కూడా సంపాదించారు.

Comments

comments