Home తాజా వార్తలు క్యాచ్‌తో పాటు గిన్నిస్ రికార్డును పట్టేశాడు!

క్యాచ్‌తో పాటు గిన్నిస్ రికార్డును పట్టేశాడు!

Hussain-Catch-Recordలార్డ్ : దాదాపు దశాబ్ధం క్రితం వీడ్కోలు చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సేన్ తను ఇంకా క్రికెట్ మీద మక్కువ తగ్గలేదని నిరూపించుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా అత్యంత ఎత్తు నుంచి వచ్చిన క్యాచును పట్టుకుని గిన్నిస్ రికార్డు బుక్‌లో స్థానం సంపాదించాడు. లారడ్స్ మైదానంలో డ్రోన్ ద్వారా అత్యంత ఎత్తు నుంచి అతి వేగంగా వచ్చిన బంతిని అందుకుని గిన్నిస్ లో స్థానం దక్కించుకున్నాడు.
సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి వదిల్ని బంతిని పట్టుకుని రికార్డు సాధించాడు. అంతకుముందు 100 అడుగుల ఎత్తు నుంచి 120 కి.మీ వేగంతో వచ్చిన బంతిని హుస్సేన్ తన మొదటి ప్రయత్నంలోనే పట్టుకున్నాడు. అయితే దానికి సంతృప్తి చెందని హుస్సేన్.. మరికొంత ఎత్తులో బంతిని వదలమని చెప్పాడు. దీనిలో భాగంగా 150 అడుగుల ఎత్తు నుంచి బంతిని అందుకుని గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నాడు. కాగా, మూడో ప్రయత్నంలో 400 అడుగుల ఎత్తు నుంచి బంతిని అందుకోవడంలో హుస్సేన్ విఫలమయ్యాడు. బంతినిపై నుంచి డ్రోన్ ద్వారా విసిరే ఈ పోటీకి 100 అడుగుల కనీస ఎత్తును నిర్ణయించారు.

https://youtu.be/vtfS4OemeU4