Home ఆఫ్ బీట్ బేటీ బచావో..బేటీ పడావో.. అమలు అద్భుతం

బేటీ బచావో..బేటీ పడావో.. అమలు అద్భుతం

మూడేళ్ల కష్టానికి ఫలం,జిల్లాకు జాతీయ అవార్డు, 8న రాజస్థాన్‌లో అవార్డు అందుకోనున్న కలెక్టర్ 

Beti-Bachao-Beti-Padao

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి మానస పుత్రికైన ‘బేటీ బచావో- బేటీ పడావో’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి బాలికల నిష్పత్తి పరంగా, విద్యా పరంగా మంచి ఫలితాలను సాధించడం ద్వారా హైదరాబాద్ జిల్లా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైనా హైదరాబాద్ జిల్లా గడిచిన మూడేళ్ల కాలంలోనే నిర్ధేశించుకున్న లక్షాన్ని మించి ఫలితాలను సాధించింది. గతంలో దేశ వ్యాప్తంగా బాలికల నిష్పత్తి అతి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 1000 మంది బాలల నిష్పతికి బాలికల సంఖ్య కేవలం 918 మాత్రమే.

దీంతో 2014 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో.. పథకం కింద హైదరాబాద్‌ను కూడా ఎంపిక చేసింది. ఆడబిడ్డ పుట్టితే తల్లిదండ్రుల గుండెల మీద కుప్పటీ అని భావించే తల్లిదండ్రులకు ఆపద సమాయల్లో అన్ని విధాల ఆదుకునేది ఆడ బిడ్డేనని చాటి చెప్పేడమే లక్షంగా జిల్లా అధికారులు పని చేశారు. తద్వారా బాలికల నిష్పత్తిని పెంచడం, వారికి ఉన్నత చదువులతో అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలన్న ఉన్నతమైన ఆలోచన అనుగుణంగా జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా విద్యా, వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు నాటి కలెక్టర్ రాహుల్ బొజ్జా కృషికి నేటి కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా ప్రత్యేక కార్యచరణ తోడు కావడంతో హైదరాబాద్ జిల్లా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్‌లోని జంజును నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా జిల్లా కలెక్టర్ యోగితారాణా ఆవార్డును అందుకోనున్నారు.

అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రత్యేక కృషి

రాష్ట్ర రాజధాని కేంద్రమే కాకుం డా అత్యంత విద్యావంతులుం టే ఈ జిల్లాలో గర్భంలో ఆడ శిశువు ఉందని తెలిస్తే మాతృత్వానికే సవాల్ వి సురుతూ, మానవ విలువలను పతనం చేస్తు గర్భంలోనే శిశు విచ్చిన ప్రక్రియ (ఆబార్షాన్లు) చో టు చేసుకుంటున్న దయనీయ పరిస్థితి అది. ఇదే తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో బేటి బచావో.. బేటి పడావో.. అమలు చేయడం ఈ పథకం కింద జిల్లా ఎంపిక కావడం, ఆ సమయంలో కలెక్టర్‌గా రాహుల్ బొజ్జా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రత్యేక కార్యచరణను రూపొందించుకోవడమే కాకుండా బాలికల నిష్పతి తగ్గడం, వారు చదువులకు దూరం కావడానికి గల కారణాలపై దృష్టి సారించారు. అయితే ఇందుకు ప్రభుత్వ అధికారులతో వివరాలను సేకరిస్తే ఎక్కడా తప్పుడు సమాచారం ఇస్తారోనన్న అ నుమానంతో ఆయన పలు స్వచ్ఛంధ సంస్థలతో తన చాం బర్‌లో సమావేశం నిర్వహించి కారణాలు వెలిక్కి తీయాల్సిందిగా కోరారు. దీంతో 7 నుంచి 10 తరగతి చదివే బాలికలు చదువులు మానేయడానికి ప్రధానంగా మూత్రశాలలు లేకపోవడమేనని స్వచ్చంధ సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్ బొజ్జా పుట్టగొడుగుల పుట్టుకువచ్చినా లింగా నిర్థారణ పరీక్ష కేంద్రాలను పూర్తిగా అదుపు చేయడం, ప్రభుత్వ నిబంధనల విరుద్దంగా పని చేస్తున్న వాటిని మూసివేయించారు. అదేవిధంగా పాఠశాలల్లో బాలికలకు అవసరమై మేర కు మూత్రశాలలు నిర్మించడంతో పాటు వారికి కావాల్సిన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు విశేష కృషి చేశారు.

గర్భిణీలు, బాలికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కలెక్టర్ యోగితా

జిల్లా కలెక్టర్ యోగితా రాణా సైతం బాలికల నిష్పత్తిని పెంచేందుకు గణనీయంగా కృషి చేస్తున్నారు. ఆమె డాక్టర్ కూడా కావడంతో ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీలు చేయడం, అక్కడ గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి లోటుపాట్లు ఉంటే వెం టనే సూచనలు చేస్తూ వాటిని సరిదిద్దుతున్నారు. అంతేకాకుండా కలెక్టర్ గర్భిణీ స్త్రీలతో స్వయంగా మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని కల్పించడంతో పాటు ఆడబిడ్డల అవశ్యకతను, వారు ఎందులో తక్కువ కాదని అందుకు తానే నిదర్శమని వివరించడం ద్వారా తల్లిదండ్రులకు అవగాహణ కల్పిస్తున్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన ఆమె వాటి పనితీరును మరింత మెరుగు పర్చి అక్కడివచ్చే బాల, బాలికలతో పాటు గర్భిణీ మహిళలు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు వైద్య సేవలను విస్తృతపర్చిచారు. దీనితో పాటు బేటి బచావో బేటి పడావోకు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ బ్రాండ్ అంబా జిటర్‌గా నియమించి విసృత్త ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా గడిచిన మూడేళ్లుగా విద్య, వైద్య, శిశు సంక్షేమ శాఖ అధికారు లు సైతం సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి అవకాశం వచ్చినా వాటని బా లికల నిష్పత్తి పెంచేందుకు వినియోగించుకుంటు ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ మూడేళ్ల కాలంలో ఇద్దరు కలెక్టర్ల కృషి. మూడు శాఖల మెరుగైన పనితీరుతో 2011 సంవత్సరంలో 918గా ఉన్న బాలికల నిష్పతి , 2015లో 938, 2016లో 967, 2017లో 951, ప్రస్తుతం 973గా కొనసాగుతోంది. ఈ అద్భుతమైన ఫలితాలే జిల్లాకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టాయి.