Home జనగామ వినియోగదారులకు అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్

వినియోగదారులకు అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్

District Collector Vinay krishna Reddy

 

జనగామ: వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సంవత్సరం భారత ప్రభుత్వం వినియోగదారుల కేసులను సకాలంలో పరిష్కరించుట అనే అంశాన్ని ఎంపిక చేశారన్నారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో నిర్వహించి మొదటి, రెండో బహుమతులను విద్యార్థులకు అందజేశారు. డిసిఐసి ఎండి.సాధిక్‌ అలీ మాట్లాడుతూ… ఐఎస్‌ఐ మార్కు కలిగిన నీటిని సరఫరా, రద్దీ సమయంలో స్త్రీల కోసం ప్రత్యేక బస్సులను కల్పించాలని, నాణ్యమైన తినుబండారాలు విక్రయించడం, మందుల సరఫరాపై అధికారులు వినియోగదారులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓజే.మధు, ఆర్డీవో మధుమోహన్, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి రోజారమణి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రష్మీ, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

National Consumer Day Meeting at Jangaon Collector office

Telangana Latest News