Search
Saturday 17 November 2018
  • :
  • :

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం

National-Film-Awardsన్యూఢిల్లీ: ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 63వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. కార్యక్రమానికి ప్రముఖ సినీ తారాలోకం తరలివచ్చింది. ఉత్తమ చిత్రంగా బాహుబలికి జాతీయ పురస్కారం వరించింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ విభాగాల్లో అవార్డు కూడా బాహుబలిని వరించింది. బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారం ‘కంచె’ సినిమాకు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా చిత్ర దర్శకుడు క్రిష్ పురస్కారాన్ని అందుకున్నారు.

Comments

comments